damnlyrics.com

Amma Donga Ninnu Choodakunte

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ

కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ

నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ

గల గల మని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ

కథ చెప్పేదాకా కంట నిదుర రాక

కథ చెప్పేదాకా నీవు నిడురబోక

కథ చెప్పేదాకా నన్ను కదలనీక

మాట తోచనీక మూతి ముడిచి చూసేవు

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే

నిలువలేక నా మనసు నీవైపే లాగితే

ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే

నిలువలేక నా మనసు నీవైపే లాగితే

గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున

గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు

ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు

ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు

కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి

కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ....

Lyrics Submitted by Rajeshwari Bommakanti

Enjoy the lyrics !!!